Anantapur District: సీఎం స్వాగత జాబితాలో తన పేరు లేదని ఎమ్మెల్యే పెద్దారెడ్డి గుర్రు.. మంత్రితో వాగ్వాదం

  • తాడిపత్రి ఎమ్మెల్యే మనస్తాపం
  • మంత్రి శంకర్‌నారాయణను నిలదీసిన ఎమ్మెల్యే 
  • ఇద్దరి మధ్య మాటల యుద్ధం
ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి స్వాగతం పలికే జాబితాలో తన పేరు లేకపోవడంతో తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి మనస్తాపం చెందారు. ‘కంటి వెలుగు’ పథకం ప్రారంభించేందుకు ఈరోజు అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి అనంతపురం విచ్చేస్తున్న జగన్‌కు హెలిప్యాడ్‌ వద్ద మంత్రి శంకరనారాయణ, ఎమ్మెల్యే  అనంత వెంకట్రామిరెడ్డి స్వాగతం పలికారు. ఈ జాబితాలో తన పేరు లేకపోవడంపై ఎమ్మెల్యే పెద్దారెడ్డి మంత్రి శంకరనారాయణను నిలదీశారు. ఈ సందర్బంగా ఇద్దరి మధ్యా వాగ్వాదం చోటు చేసుకుంది.
Anantapur District
MLA peddareddy
minister sankarnarayana

More Telugu News