Sensex: ఆరు రోజుల నష్టాల తర్వాత దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు

  • 646 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 187 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • ఐదు శాతం పైగా నష్టపోయిన యస్ బ్యాంక్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. తద్వారా ఆరు రోజుల వరుస నష్టాలకు ముగింపు పలికాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాకులు లాభాలను ముందుండి నడిపించాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 646 పాయింట్లు పెరిగి 38,178కి ఎగబాకింది. నిఫ్టీ 187 పాయింట్లు లాభపడి 11,313కు చేరుకుంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (5.72%), భారతి ఎయిర్ టెల్ (5.51%), ఐసీఐసీఐ బ్యాంక్ (4.88%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (4.78%), మహీంద్రా అండ్ మహీంద్రా (4.25%),    

టాప్ లూజర్స్:
యస్ బ్యాంక్ (-5.26%), హీరో మోటో కార్ప్ (-2.65%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-2.19%), ఐటీసీ (-1.81%), టీసీఎస్ (-1.57%).

More Telugu News