India: మా భద్రత మాకు ముఖ్యం...ఎవరినీ భయపెట్డానికి కాదు: రాజ్‌నాథ్‌సింగ్‌

  • సామర్థ్యం పెంపులో భాగమే అత్యాధునిక ఆయుధాలు
  • రాఫెల్‌ విమానంలో 25 నిమిషాలు చక్కర్లు
  • సూపర్‌సోనిక్‌ వేగంతో ప్రయాణిస్తానని కలలో కూడా ఆనుకోలేదు

దేశ భద్రతకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని, సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంలో భాగమే అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకోవడం అని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్‌సింగ్‌ అన్నారు. ఆయుధ సామగ్రిని సమకూర్చుకుని ఎవరినీ భయపెట్టాలన్న ఉద్దేశం భారత్‌కు లేదని స్పష్టం చేశారు. దసరా సందర్భంగా ప్రాన్స్‌లోని డసో ఏవియేషన్‌ సంస్థ నుంచి తొలి యుద్ధ విమానం రాఫెల్‌ను స్వీకరించి ఆయుధ పూజ చేసిన అనంతరం ఆయన 25 నిమిషాలపాటు విమానంలో చక్కర్లు కొట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్‌ సోనిక్‌ వేగంతో తాను ప్రయాణిస్తానని కలలో కూడా ఊహించలేదని, రాఫెల్‌లో విహారం చాలా సౌకర్యవంతంగా ఉందని అన్నారు. జీవితంలో ఇలాంటి క్షణాలు ఒక్కసారే వస్తాయన్నారు. రాఫెల్ రాకతో దేశ భద్రత మరింత పటిష్టమవుతుందని చెప్పారు.

2021 నాటికి 18.. 2022 నాటికి మొత్తం 36 రాఫెల్ జెట్లు భారత్‌ అమ్ముల పొదిలో చేరుతాయన్నారు. ఈ ఘనత ప్రధాని నరేంద్ర మోదీదేనన్నారు. మోదీ సాహసోపేత నిర్ణయాల వల్ల దేశానికి మేలు జరుగుతోందని చెప్పారు.

More Telugu News