Jupudi: నేను మరణిస్తే ఒకే పార్టీ జెండా కప్పించుకుంటా... నాలుగు పార్టీల జెండాలు కప్పించుకోను: జూపూడిపై అయ్యన్న విమర్శలు

  • టీడీపీని వీడి వైసీపీలో చేరిన జూపూడి
  • టీడీపీ నాయకుల విమర్శలు
  • అవకాశవాది అంటూ ధ్వజమెత్తిన అయ్యన్న
వైసీపీలో చేరిన జూపూడి ప్రభాకర్ రావుపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. తాజాగా, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తల్లిలాంటి పార్టీ కష్టాల్లో ఉంటే, పార్టీని వదిలి పారిపోయేవాళ్లు పిరికిపందలతో సమానం అని, అలాంటివాళ్లు తమకు అవసరంలేదని అన్నారు.

 తాను చనిపోతే ఒకే పార్టీ జెండా కప్పించుకుంటానే తప్ప నాలుగు పార్టీల జెండాలు కప్పించుకోనని వ్యాఖ్యానించారు. ఇలాంటి అవకాశవాదులు ఏ పార్టీలో ఉన్నా చీడపురుగులు వంటివారేనని, వారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. వారిని దూరంగా పారద్రోలినప్పుడే రాజకీయాలకు అంటిన మురికి వదిలిపోతుందని వ్యాఖ్యానించారు.
Jupudi
Ayyanna Patrudu
Telugudesam
YSRCP

More Telugu News