Pakistan: ఎల్ఓసీ వెంట తిరిగి ప్రారంభమైన ఉగ్ర శిబిరాలు!

  • 18 శిబిరాలు, 20 లాంఛ్ ప్యాడ్ లూ ప్రారంభం
  • ఒక్కో శిబిరంలో 60 మంది టెర్రరిస్టులు
  • సైన్యం అప్రమత్తంగా ఉండాలన్న నిఘా వర్గాలు
వాస్తవాధీన రేఖ వెంబడి పాకిస్థాన్ 18 ఉగ్రవాద శిబిరాలను తిరిగి ప్రారంభించిందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ మేరకు సైన్యం అప్రమత్తంగా ఉండాలంటూ ఉన్నతాధికారులు సూచించారు. 18 ఉగ్ర శిబిరాలు, 20 లాంచ్ ప్యాడ్ లు ప్రారంభమైనట్టు తెలుస్తోందని, ఒక్కో శిబిరంలో 60 మంది వరకూ టెర్రరిస్టులు ఉన్నారని వెల్లడించారు. ఇటీవల పుల్వామాలో జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హిజబుల్ ముజాహిద్దీన్ నేతలు సమావేశమై, ఉగ్ర శిబిరాల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకున్నారని ఇంటెలిజెన్స్ ఏజన్సీలు వెల్లడించాయి. కాగా, కశ్మీర్ లోయలో 300 మంది వరకూ టెర్రరిస్టులు ఉన్నారని జమ్మూ కాశ్మీర్ డీజీపీ దిల్ బాగ్ సింగ్ వెల్లడించిన 24 గంటలు గడవకుండానే ఈ హెచ్చరికలు రావడం గమనార్హం.
Pakistan
LOC
Terror Camp
Intelegence

More Telugu News