Narendra Modi: వాయుసేన విజయాల వీడియోను పోస్ట్ చేసిన నరేంద్ర మోదీ... వైరల్!

  • నేడు వాయుసేన వార్షికోత్సవం
  • శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని
  • జాతి గర్విస్తోందని వ్యాఖ్య
నేడు భారత వాయుసేన 87వ వార్షికోత్సవం కాగా, ట్విట్టర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భారత వాయుసేనను చూసి జాతి యావత్తూ గర్విస్తోందన్నారు. దేశానికి నిబద్ధత, ప్రతిభతో కూడిన సేవలను వాయుసేన అందిస్తోందని కొనియాడిన ఆయన, భరతజాతి తరఫున ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇలాగే నిబద్ధతతో కూడిన ప్రతిభావంతమైన సేవలను కొనసాగించాలని అభిలషిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారత వాయుసేన సాధించిన విజయాలతో కూడిన ఓ వీడియోను తన ట్వీట్‌ కు ప్రధాని జోడించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Narendra Modi
IAF
Anniversary

More Telugu News