Kotamreddy: నిజాయతీగా వ్యవహరించిన మహిళా అధికారికి జగన్ ప్రభుత్వం చేసిన అన్యాయం ఇది: నారా లోకేశ్ వ్యాఖ్యలు

  • వివాదాస్పదంగా కోటంరెడ్డి వ్యవహార శైలి
  • మహిళా ఎంపీడీవో నివాసంపై దాడిచేశారంటూ ఆరోపణలు
  • అరెస్ట్, ఆపై బెయిల్ మీద విడుదల

వైసీపీ శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎంపీడీవో సరళ నివాసంపై దాడికి పాల్పడినట్టు ఆరోపణలు రాగా, ఈ వ్యవహారంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం, ఆపై ఆయన కొన్ని గంటల్లోనే బెయిల్ పై బయటికి రావడం తెలిసిందే. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు.

తన ప్రాణాలకు ముప్పు ఉందని ఓ మహిళా ఎంపీడీవో అర్ధరాత్రి వేళ ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళితే కేసు నమోదు చేసేందుకు 8 గంటల పాటు తర్జనభర్జన పడ్డారని ఆరోపించారు. ఆమె కష్టాలకు కారకుడైన వైసీసీ ఎమ్మెల్యేకు మాత్రం పోలీస్ స్టేషన్ లో రాచమర్యాదలు చేసి, నామమాత్రపు కేసులు పెట్టి 2 గంటల్లోనే బెయిల్ పై పంపించేశారని విమర్శించారు. దసరా ఉత్సవాలను స్త్రీశక్తికి సూచికగా జరుపుకుంటారని, అలాంటి వేళ విధి నిర్వహణలో నిజాయతీగా వ్యవహరించిన ఓ మహిళా అధికారికి జగన్ ప్రభుత్వం చేసిన అన్యాయం ఇది అంటూ ట్విట్టర్ లో స్పందించారు.

More Telugu News