JeM: జైషే మహ్మద్ ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్న కశ్మీర్ పోలీసులు

  • ఉగ్రవాది నుంచి ఆయుధాలు స్వాధీనం
  • భద్రతా బలగాలకు భారీ విజయం
  • జైషే సమాచారం తెలుసుకునే అవకాశం
కశ్మీర్ లోయలో కొన్నిగంటలుగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గాందర్ బల్ అడవుల్లోకి సైన్యం భారీగా తన కమెండోలను ఎయిర్ లిఫ్ట్ చేస్తోంది. అత్యున్నత స్థాయి కమెండోలను సరిహద్దు సమీపంలోని దట్టమైన అడవుల్లోకి తరలిస్తుండడంతో అక్కడేదో జరగబోతోందన్న సంకేతాలు అందుతున్నాయి. మరోపక్క, కశ్మీర్ పోలీసులు జైషే మహ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకున్నారు. అతడిని బారాముల్లా ప్రాంతానికి చెందిన మొహిసిన్ మంజూర్ సల్హేగా గుర్తించారు. అతడి నుంచి ఆయుధాలు, మందుగుండు స్వాధీనం చేసుకున్నారు.

ఓ టెర్రరిస్టును సజీవంగా బంధించడం భద్రతా బలగాలకు వ్యూహాత్మక విజయం అని చెప్పాలి. అతడి అరెస్టు ద్వారా జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ కీలక సమాచారం రాబట్టే అవకాశం ఇప్పుడు భారత్ ముందు నిలిచింది. ఓ ప్రమాదకర ఉగ్రవాదిని సజీవంగా పట్టుకోవడం పట్ల జమ్మూకశ్మీర్ పోలీసులపై అభినందనల వర్షం కురుస్తోంది.
JeM
Jammu And Kashmir
India
Pakistan

More Telugu News