KCR: టీఆర్ఎస్ కు ఎన్నికల మద్దతును ఆర్టీసీ సమ్మెతో ముడిపెట్టవద్దు.. కేసీఆర్ మొండి వైఖరి వీడాలి: చాడ వెంకటరెడ్డి

  • టీఆర్ఎస్ కు మద్దతు రాజకీయపరమైన నిర్ణయం
  • ఆర్టీసీ కార్మికులకు సీపీఐ పూర్తిగా మద్దతిస్తోంది
  • కార్మికులు ఇబ్బందుల్లో ఉంటే సీపీఐ ఊరుకోదు

హుజూర్ నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ కు మద్దతిస్తుండటాన్ని... ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ముడిపెట్టవద్దని సీపీఐ నేత చాడ వెంకట రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి మద్దతనేది రాజకీయపరమైన నిర్ణయమని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సీపీఐ పూర్తి మద్దతు పలుకుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలతో ఆర్టీసీ తీవ్ర సంక్షోభంలో ఉందనే విషయం అర్థమవుతోందని చెప్పారు.

కేసీఆర్ మొండి వైఖరిని వీడాలని, సరైన దిశగా ఆలోచించాలని సూచించారు. ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని... అందువల్ల ఇక్కడి ఆర్టీసీని కూడా ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు కోరుతున్నారని... వారిలో ఎంతో ఆవేదన ఉందని అన్నారు. కార్మికులు ఇబ్బందుల్లో ఉంటే తమ పార్టీ ఊరుకోదని చెప్పారు. అరెస్ట్ చేసిన ఆర్టీసీ ఉద్యోగ సంఘ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతాలను తక్షణమే విడుదల చేయాలని అన్నారు.

  • Loading...

More Telugu News