Balakrishna: హుజూర్ నగర్ ఎన్నికల ప్రచారానికి బాలకృష్ణ!

  • టీడీపీ తరఫున బరిలో చావా కిరణ్మయి
  • 13 నుంచి ప్రచారానికి బాలయ్య
  • 21న హుజూర్ నగర్ ఎన్నికలు
హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేసేందుకు  హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ నియోజకవర్గానికి టీడీపీ తరఫున చావా కిరణ్మయి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.  ఎన్నికల ప్రచారం, తెలుగుదేశం పరిస్థితిపై తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, పొలిట్ బ్యూరో మెంబర్ అరవింద కుమార్ గౌడ్ లతో పాటు రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు చంద్రబాబుతో సమావేశమై చర్చించారు.

ఈ సందర్భంగా బాలయ్య పర్యటన, ప్రచారం గురించి కూడా చర్చ సాగింది. ఈ నెల 13వ తేదీ ఆదివారం నుంచి బాలకృష్ణ పర్యటన సాగుతుందని, ఐదు నుంచి ఆరు రోజులు ఆయన ప్రచారం చేస్తారని తెలుస్తోంది. కాగా, 21న హుజూర్ నగర్ ఉప ఎన్నిక జరుగనుండగా, అధికార టీఆర్ఎస్ ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తుండగా, తమ సిట్టింగ్ స్థానాన్ని తామే గెలుచుకోవాలన్న పట్టుదలతో కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది.
Balakrishna
Huzur Nagar
By Polls
Chava Kiranmayi

More Telugu News