Hyderabad: టీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘ నేతలను అడ్డుకున్న పోలీసులు.. గన్ పార్క్ లోకి అనుమతి నిరాకరణ

  • అమర వీరులకు నివాళులర్పించేందుకు వచ్చిన కార్మిక  నేతలు
  • పార్క్‌ వద్ద స్వల్ప ఉద్రిక్తత
  • ఇదేం తీరని కార్మిక సంఘాల మండిపాటు
అమర వీరులకు నివాళులర్పించేందుకు తెలంగాణ ఆర్టీసీ ఐక్య కార్యాచరణ నేతలు హైదరాబాదులోని అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌ వద్దకు వెళ్లగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. కార్మిక సంఘాల ఆందోళన నేపధ్యంలో ముందుగానే అప్రమత్తమైన పోలీసులు గన్‌పార్క్‌ వద్ద భారీగా మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా అవసరమైన చర్యలు చేపట్టారు.

ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన కార్మిక సంఘాల నేతలను లోపలికి వెళ్లేందుకు అనుమతించలేదు. తాము శాంతియుతంగా అమర వీరులకు నివాళులర్పించేందుకు వస్తే అడ్డుకోవడం ఏంటని నేతలు ప్రశ్నించినా పోలీసులు అంగీకరించలేదు. ఈ సందర్భంగా పోలీసులకు, కార్మిక సంఘాల నేతలకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగి ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Hyderabad
gunpark
RTC JAC

More Telugu News