Akshay Kumar: తోటి ఆర్టిస్టును కాపాడేందుకు ముందుకు దూకిన అక్షయ్ కుమార్... వీడియో ఇదిగో!

  • మనీష్ షోలో పాల్గొన్న అక్షయ్
  • గాల్లో వేలాడుతూ అపస్మారక స్థితిలోకి స్టంట్ మెన్
  • ఒక్క ఉదుటున వచ్చి పట్టుకున్న అక్షయ్
వీక్షకుల కేరింతల మధ్య మనీష్ పాల్ షో జరుగుతుండగా, అపస్మారక స్థితిలోకి వెళ్లి కిందపడిపోతున్న తోటి స్టంట్ మ్యాన్ ను కాపాడేందుకు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ముందుకు దూకారు. తన క్రూతో కలిసి 'మూవీ మస్తీ విత్ మనీష్ పాల్' ప్రదర్శనలో అక్షయ్ పాల్గొన్న వేళ ఈ ఘటన జరిగింది.

ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాళ్లపై వేలాడుతూ ఓ స్టంట్ షోను ప్రదర్శిస్తుండగా, ఆర్టిస్ట్ ఒకరు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. గాల్లోనే తల వాల్చేసి పడిపోబోగా, అక్షయ్ ఒక్క ఉదుటన వచ్చి, అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఓ బెంచ్ పై కూర్చుని, అతను మరింతగా జారకుండా ఆసరా ఇచ్చారు.

ఈలోగా మిగతా క్రూ వచ్చి అతన్ని తాళ్ల నుంచి విడిపించారు. అతని పేరు అలీ అస్గర్ గా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను మీరూ చూడవచ్చు. ఈ వీడియోను చూసిన వారంతా అక్షయ్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. 
Akshay Kumar
Stunt Man
Manish Show

More Telugu News