Crime News: కోడలితో మామ అనైతిక సంబంధం.. కంటపడడంతో భార్య, తండ్రిని హత్య చేసిన కొడుకు

  • కోడలితో మామ అనైతిక వ్యవహారం
  • ఇంటికి వచ్చిన భర్తకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన వైనం
  • అక్కడికక్కడే చంపేసిన భర్త
తన తండ్రితో భార్య కొనసాగిస్తున్న అనైతిక బంధాన్ని కళ్లారా చూసిన భర్త తట్టుకోలేక ఇద్దరినీ హత్యచేసిన ఘటన ఇది. పోలీసుల కథనం మేరకు...కర్ణాటక రాష్ట్రం విజయపురం జిల్లాలోని ఇండి తాలూకా ఖేడగి గ్రామానికి చెందిన పుట్టప్ప, రేణుక(35)లు దంపతులు. దంపతులతోపాటు పుట్టప్ప తండ్రి కూడా ఉంటున్నాడు. వ్యవసాయం చేసుకునే పుట్టప్ప రోజూ పొలానికి వెళ్లిపోతే, ఇంట్లో మామ మాళప్ప, కోడలే ఉండేవారు. ఈ పరిస్థితి ఇద్దరి మధ్య అనైతిక బంధానికి దారితీసింది. కొన్నాళ్లుగా ఈ వ్యవహారం సాగుతోంది.

శనివారం మధ్యాహ్నం పుట్టప్ప ఎప్పటిలాగే పొలం పనులు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాడు. ఆ సమయానికి తండ్రి, భార్య పడక గదిలో చూడరాని స్థితిలో ఉండడం చూసి తట్టుకోలేకపోయిన పుట్టప్ప కత్తితో వారిద్దరిపై దాడికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావం జరిగి రేణుక, మాళప్ప అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం పుట్టప్ప ఇంటి నుంచి పారిపోయాడు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని విచారణ చేబట్టారు. 
Crime News
wife and father murdered
illegala affair
karanataka

More Telugu News