tiktok: బస్సులో తుపాకితో కాల్చుకుని 'టిక్ టాక్' విలన్ ఆత్మహత్య

  • సోషల్ మీడియాలో భయపెట్టే పోస్టులు
  • మూడు హత్య కేసుల్లో నిందితుడు
  • పోలీసులు పట్టుకునేందుకు వస్తుండడంతో ఆత్మహత్య
ఉత్తరప్రదేశ్‌కు చెందిన టిక్‌టాక్ విలన్ అశ్వినీ కుమార్ (30) తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మూడు హత్య కేసుల్లో ప్రధాన నిందితుడైన అశ్వినీ కుమార్ బర్హాపూర్ ప్రాంతంలో ఓ బస్సులో ఆత్మహత్య చేసుకున్నాడు. ‘నేను అన్నింటినీ నాశనం చేస్తా’, ‘దెయ్యం ఇప్పుడు రెడీగా ఉంది’, ‘నేను సృష్టించే విలయం చూడండి’ అంటూ ఫేస్‌బుక్‌లో పోస్టింగులు పెట్టే అశ్వినీ కుమార్ మాదక ద్రవ్యాలకు బానిసగా మారినట్టు సమాచారం.

స్థానిక బీజేపీ నేత కుమారుడు, అతని మేనల్లుడిని హత్య చేసిన కేసులో అశ్వినీ కుమార్ నిందితుడు. అతడి తలపై లక్ష రూపాయల రివార్డు కూడా ఉంది. అలాగే, తన మాట విననందుకు ఓ యువతిని చంపేశాడు. వారం రోజులుగా నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీంతో భయపడిన అశ్వినీకుమార్ ఢిల్లీ పారిపోయేందుకు బస్సెక్కాడు. అతడెక్కిన బస్సును పోలీసులు తనిఖీ చేయటానికి ఆపడంతో భయపడి తుపాకితో కాల్చుకుని చనిపోయాడు.
tiktok
Uttar Pradesh
ashwini kumar
suicide

More Telugu News