Vijayawada: రెండంచెల భద్రతతో బెజవాడ దుర్గమ్మ తెప్పోత్సవం

  • తెప్పోత్సవంపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
  • బోటు సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకోవాలని వెల్లడి
  • అన్ని తనిఖీలు చేశాకే తెప్పోత్సవం నిర్వహించాలని ఆదేశం

దసరా నవరాత్రుల సందర్భంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారికి తెప్పోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈసారి దుర్గమ్మ తెప్పోత్సవానికి రెండంచెల భద్రత ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తెప్పోత్సవంపై జిల్లా కలెక్టర్ వివిధ శాఖలతో సమీక్ష నిర్వహించారు. తెప్పోత్సవానికి ఉపయోగించే బోటు సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. సంబంధిత అధికారులు తనిఖీలు నిర్వహించాకే తెప్పోత్సవం నిర్వహించాలని ఆదేశించారు.

దసరా మహోత్సవాల్లో కీలకంగా భావించే తెప్పోత్సవం ఈ నెల 8న నిర్వహించనున్నారు. అయితే, కృష్ణా నదికి వరద ఉద్ధృతి పెరిగే క్రమంలో ఈ నెల 7న తెప్పోత్సవం నిర్వహించే విషయమై సమీక్ష జరిపే అవకాశాలున్నాయి.

  • Loading...

More Telugu News