Navaratnalu: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎంపీల ఆరోపణ

  • ఏపీకి విడుదల చేస్తున్న నిధులను ‘నవరత్నాలు’కు మళ్లిస్తున్నారు
  • గతంలో ఉపాధి హామీ పనుల బిల్లులను ఆపివేయడం తగదు
  • కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి వచ్చింది
ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపణలు చేశారు. ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఏపీ కోసం విడుదల చేస్తున్న నిధులను ‘నవరత్నాలు’ అమలు చేసేందుకు మళ్లిస్తోందని ఆరోపించారు.

గతంలో తమ ప్రభుత్వం ఉపాధి హామీ కింద చేసిన పనుల బిల్లులను వైసీపీ ప్రభుత్వం ఆపి వేయడంతో కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి వచ్చిందని ఆరోపించారు. 2006లో నిర్వహించిన ఉపాధి హామీ నియామకాలను కాదని ప్రస్తుత ప్రభుత్వం వాలంటీర్లను నియమించిందని విమర్శించారు. గ్రామ సచివాలయాలకు రంగులు మార్చి వైసీపీ పార్టీ కార్యాలయాలుగా మారుస్తున్నారని మండిపడ్డారు.
Navaratnalu
Telugudesam
Galla
kanaka medela

More Telugu News