Chiranjeevi: గన్నవరం ఎయిర్ పోర్టుకు చిరంజీవి... 'సైరా' అంటూ అభిమానుల కేరింతలు!

  • నేడు ఎస్వీఆర్ విగ్రహావిష్కరణ
  • తాడేపల్లి గూడెం వరకూ ర్యాలీ
  • చిరంజీవికి ఘన స్వాగతం
ఈ మధ్యాహ్నం తాడేపల్లి గూడెంలో దివంగత మహా నటుడు ఎస్వీ రంగారావు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు మెగాస్టార్ చిరంజీవి విజయవాడ చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయనకు అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది.

చిరంజీవి వస్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ తో పాటు జనసేన నేతలు ఆయనకు స్వాగతం పలికేందుకు ఎయిర్ పోర్టుకు వచ్చారు. 'సైరా... సైరా' అంటూ నినాదాలు చేశారు. మరికాసేపట్లో చిరంజీవి ర్యాలీగా తాడేపల్లి గూడెం బయలుదేరనున్నారు. ఆయన వెంట దాదాపు 200కు పైగా వాహనాలు కదలనున్నాయి.
Chiranjeevi
Gannavaram
Vijayawada
SVR
Statue

More Telugu News