Kurnool District: యురేనియం తవ్వకాలపై ప్రభుత్వం తెలిసీ తెలియనట్టు ఉండటమేంటి?: చంద్రబాబునాయుడు

  • ఆళ్లగడ్డ - గాజులపల్లి వరకు యురేనియం తవ్వకాలు
  • ఏఎండీ సంస్థ తవ్వకాలు జరుపుతోంది
  • ప్రజల ఆందోళనను ప్రభుత్వం ఎందుకు అర్థం చేసుకోదు?
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో జరుగుతున్న యురేనియం తవ్వకాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించారు. ఆళ్లగడ్డ మండల కేంద్రం నుండి గాజులపల్లి వరకు అటామిక్‌ మినరల్స్‌ డైరెక్టరేట్‌ ఫర్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఏఎండీ) సంస్థ యురేనియం కోసం తవ్వకాలు జరుపుతుంటే ప్రభుత్వం తెలిసీ తెలియనట్టు ఉండటమేంటి? ప్రజల ఆందోళనను ప్రభుత్వం ఎందుకు అర్థం చేసుకోదు? అని ప్రశ్నించారు.

 యురేనియం తవ్వకాలను నిరసిస్తూ విజయవాడలో ఇటీవల నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి వైసీపీ నేతలు హాజరుకాకపోవడం వెనుక ఆంతర్యమేంటి?  రేపు ఆదివారం ఓబులంపల్లిలో జరిగే అఖిలపక్ష పోరాటానికి వైసీపీ మద్దతు ఉందా? లేదా? అని ప్రశ్నించారు. దివంగత సీఎం వైఎస్ హయాంలోనే యురేనియం ప్లాంటుకు అనుమతులిచ్చి నల్లమల అటవీ ప్రాంతానికి ముప్పు తెచ్చారని, విమర్శించారు. ఇప్పుడు ఈ అంశాన్ని సీఎం జగన్ వినీ విననట్టు తప్పించుకుపోతున్నారని, ప్రజలకు, రైతులకూ అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.
Kurnool District
Allagadda
Chandrababu
jagan

More Telugu News