Ramcharan: ఉపాసన కొణిదెలకు ప్రతిష్ఠాత్మక అవార్డు!

  • కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లీడర్ విభాగంలో అవార్డు 
  • అవార్డుతో నూతనోత్సాహం లభించిందని స్పందన
  • సోషల్ మీడియాలో ఫోటోలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసనకు ప్రతిష్ఠాత్మక మహాత్మా గాంధీ అవార్డు లభించింది. గాంధీ 150వ జయంతి సందర్భంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లీడర్ విభాగంలో ఈ అవార్డుకు ఉపాసనను ఎంపిక చేశారు. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో అవార్డును అందుకున్న ఆమె, సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేశారు.

 ఈ అవార్డు తనకు మరింత ప్రేరణ కలిగించిందన్నారు. ఇతరులకు సేవ చేయడం ద్వారా... నిన్ను నువ్వు కోల్పోయే క్రమంలో, నీలోని నిజమైన మనిషిని కనుగొనవచ్చని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు. ఈ గాంధీ జయంతి తన కుటుంబానికి నూతన ఉత్సాహాన్ని అందించిందని, 'సైరా'పై ప్రేమ కురిపిస్తున్న అభిమానులందరికీ కృతజ్ఞతలని అన్నారు.

  • Loading...

More Telugu News