Donald Trump: ఆరోగ్య బీమా లేదా.. అయితే అమెరికాలో కాలుపెట్టలేరు: ట్రంప్ కొత్త రూల్

  • ఆరోగ్య బీమా తప్పనిసరి
  • పెట్టుబడి పెట్టలేనివారికి స్థానం లేదు
  • కొత్త ఆదేశాలపై ట్రంప్ సంతకం

అమెరికాలో కాలు పెట్టాలని భావించే వారు తప్పనిసరిగా ఆరోగ్య బీమాను కలిగివుండాలని డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన బిల్లుపై ఆయన సంతకం చేశారు. ఒకవేళ, హెల్త్ ఇన్స్యూరెన్స్ లేకుండా యూఎస్ లో కాలు పెట్టే వలసదారులు తప్పనిసరిగా 30 రోజుల్లోనే బీమా సౌకర్యాన్ని పొందాల్సి వుంటుందని వైట్ హౌస్ తన తాజా ఆదేశాల్లో పేర్కొంది. హెల్త్ కేర్ కోసం పెట్టుబడి పెట్టలేనివారికి తమ దేశంలో స్థానం లేదని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు.

నవంబర్ 3 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వచ్చినట్టని, చట్టబద్ధంగా దేశంలోకి ప్రవేశించేవారికి ఈ ఆదేశాలు అడ్డుకాబోవని వైట్ హౌస్ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, 2020 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 18 వేల మంది శరణార్థులను దేశంలో నివాసం ఉండేందుకు అనుమతిస్తామని ట్రంప్ ప్రభుత్వం ఇటీవలే వెల్లడించిన సంగతి తెలిసిందే. మోడ్రన్ రెఫ్యూజీ ప్రోగ్రామ్ ప్రారంభమైన తరువాత ఓ సంవత్సరంలో అమెరికాలో వలసదారుల సంఖ్యను ఇంత తక్కువకు కుదించడం ఇదే తొలిసారి.

More Telugu News