KCR: కేసీఆర్ తీరుతో తెలంగాణ ప్రజలు రగిలిపోతున్నారు: విజయశాంతి

  • పండుగను అందరికీ దూరం చేసి ఆయన మాత్రం జరుపుకోవాలనుకుంటున్నారు
  • ఈ దారుణ స్థితికి కేసీఆర్ మొండివైఖరే కారణం
  • మరో ఉద్యమానికి సమయం ఆసన్నం
ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశ ధోరణితో తెలంగాణ ప్రజలు రగిలిపోతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి అన్నారు. తన మాటే నెగ్గాలని, ఎదురు తిరిగితే అణచివేయాలన్న ధోరణితో కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తనకు మద్దతుగా నిలిచి ఉద్యమాన్ని నడిపించిన ఉద్యోగులు, విద్యార్థులపై కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు. ఆర్టీసీ కార్మికుల విషయంలో కేసీఆర్ ప్రదర్శించిన ఆధిపత్య ధోరణి ఆయన నిజస్వరూపాన్ని బయటపెట్టిందన్నారు.

దసరాను రెండు తెలుగు రాష్ట్రాలు చాలా ముఖ్యమైన పండుగగా భావిస్తాయని కానీ, ఆర్టీసీ సమ్మె వల్ల ప్రజలు తమ కుటుంబ సభ్యులతో కలిసి పండుగ జరుపుకోలేకపోతున్నారని విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దారుణ స్థితికి కేసీఆర్ మొండివైఖరే కారణమన్నారు. అందరికీ ఆనందాన్ని దూరం చేసి, తాను మాత్రం తన కుటుంబంతో దసరా పండుగను జరుపుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారని, ఇది ఆయన దొరతనానికి నిదర్శనమని అన్నారు. కేసీఆర్ తీరుపై మరోమారు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని విజయశాంతి హెచ్చరించారు.
KCR
vijayashanthi
Congress
TRS
Telangana

More Telugu News