tsrtc: కార్మికులది బాధ్యతారాహిత్యం.. ప్రభుత్వం ఎప్పుడూ అలా చెప్పలేదు: మంత్రి పువ్వాడ

  • నష్టాల్లో ఉన్న ఆర్టీసీని కాపాడుకోవాలి
  • సమ్మె చట్ట విరుద్దం
  • సాయంత్రం తర్వాత కార్మికులు ఉద్యోగాలు పోగొట్టుకున్నట్టే

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. దసరా పండుగ సమయంలో సమ్మెలేంటని ప్రశ్నించారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని కాపాడుకోవాల్సింది పోయి చట్టవిరుద్ధంగా సమ్మెలకు దిగడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక సంఘాలతో జరిగిన చర్చలకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరించినట్టు తెలిపారు. నేటి సాయంత్రం ఆరు గంటల్లోగా విధుల్లో చేరని కార్మికులు తమ ఉద్యోగాలు పోగొట్టుకున్నట్టేనని హెచ్చరించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు.

మరోవైపు, కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. 2600 ప్రైవేటు బస్సుల కోసం నేడు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అవసరమైతే పొరుగు రాష్ట్రాల నుంచి ప్రైవేటు వాహనాలను తెప్పించాలని యోచిస్తోంది.

More Telugu News