Avanthi Srinivas: ఆటోలపై జగన్ ఫొటోలు పెట్టుకోండి.. ఆర్టీఏ అధికారులు ఇబ్బంది పెట్టరు: అవంతి శ్రీనివాస్

  • విశాఖలో వైయస్సార్ వాహన మిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన అవంతి
  • ఆటో డ్రైవర్లకు పత్రాల అందజేత
  • విశాఖలోనే 25 వేల మంది డ్రైవర్లకు సాయాన్ని అందిస్తున్నామన్న మంత్రి
ఆంధ్రప్రదేశ్ లో వైయస్సార్ వాహన మిత్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ నేడు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం కింద సొంత ఆటో, కారు ఉన్న డ్రైవర్లకు ప్రతి ఏటా రూ. 10 వేలను ప్రభుత్వం అందించనుంది. మరోవైపు విశాఖలో ఈ కార్యక్రమాన్ని మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర పత్రాలను అందజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, కేవలం విశాఖలోనే 25 వేల మంది డ్రైవర్లకు సాయాన్ని అందిస్తున్నామని చెప్పారు. ఆటోలపై జగన్ ఫొటోలను పెట్టుకోవాలని సూచించారు. జగన్ ఫొటో పెట్టుకుంటే ఆర్టీఏ అధికారులెవరూ ఇబ్బంది పెట్టరని అన్నారు.  
Avanthi Srinivas
Andhra Pradesh
Jagan
YSR Vahana Mitra
YSRCP

More Telugu News