East Godavari District: యువతి ఆత్మహత్యా యత్నం... ఏపీ మంత్రి విశ్వరూప్‌ ఇంటివద్ద కలకలం

  • పురుగుల మందు తాగడంతో అక్కడి వారు షాక్
  • కుటుంబ కలహాలే కారణం
  • బాధితురాలు ఆసుపత్రికి తరలింపు
కుటుంబ కలహాల నేపథ్యంలో న్యాయం చేయాలంటూ మంత్రికి మొరపెట్టుకున్నా పట్టించుకోలేదన్న మనస్తాపంతో ఓ యువతి ఏపీ మంత్రి ఇంటి ముందు ఆత్మహత్యా యత్నం చేయడం కలకలం రేపింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మంత్రి పినిపే విశ్వరూప్‌ ఇంటి ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. తన ఆవేదన చెప్పుకునేందుకన్నట్లు వచ్చిన యువతి హఠాత్తుగా పురుగుల మందు తాగడంతో అక్కడి వారు షాకయ్యారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.
East Godavari District
Crime News
suicide attempt
minister pinipe

More Telugu News