Shivsena: శివసేనకు సినీ గ్లామర్.. దీపాలీని పార్టీలోకి ఆహ్వానించిన ఉద్ధవ్ థాకరే

  • శివసేనలో చేరిన ప్రముఖ మరాఠీ నటి దీపాలీ
  • పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన ఉద్ధవ్ థాకరే
  • ముంబ్రా కల్వ స్థానం నుంచి పోటీ చేయబోతున్నానన్న దీపాలీ
మహారాష్ట్రలోని రాజకీయ పార్టీల్లో సినీ గ్లామర్ పెరుగుతోంది. గత పార్లమెంటు ఎన్నికల సమయంలోనే పలువురు నటులు రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ తరుణంలో ప్రముఖ మరాఠీ నటి దీపాలీ సయ్యద్ శివసేనలో చేరారు. శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే, ఆయన కుమారుడు ఆదిత్య థాకరేల సమక్షంలో పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా దీపాలీకి పార్టీ జెండాను, సభ్యత్వాన్ని ఉద్ధవ్ థాకరే అందించారు. అనంతరం దీపాలీ మాట్లాడుతూ, తాను ముంబ్రా కల్వ నియోజకవర్గం నుంచి పోటీ  చేయబోతున్నట్టు తెలిపారు. అక్టోబర్ 21న మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.
Shivsena
Deepali Sayed
Uddhav Thackeray

More Telugu News