Rai Lakshmi: కన్న కూతుర్ని చంపిన తల్లి పాత్రలో రాయ్ లక్ష్మి!

  • కార్పొరేట్ ప్రపంచంలో సంచలన హత్యోదంతం 
  • కూతురు షీనాబోరాను హత్య చేసిన ఇంద్రాణి 
  • నెగటివ్ ఛాయలున్న పాత్రలో రాయ్ లక్ష్మి
కొన్నాళ్ల క్రితం ముంబై కార్పొరేట్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన సంఘటన.. షీనాబోరా హత్యోదంతం!
మీడియా ప్రముఖురాలు ఇంద్రాణి ముఖర్జియా తన కన్న కూతురు షీనా బోరాను కర్కశంగా హత్య చేసిన వైనం అందర్నీ నివ్వెరపోయేలా చేసింది. ఈ కేసు ప్రస్తుతం విచారణలో వుండగా, ఇప్పుడు ఇంద్రాణి జైలు జీవితాన్ని గడుపుతోంది. ఇప్పుడీ హత్యోదంతాన్ని తెలుగులో సినిమాగా రూపొందిస్తున్నారు.

విలనిజంతో సాగే ఇంద్రాణి పాత్రను ప్రముఖ నటి రాయ్ లక్ష్మి పోషిస్తుండడం విశేషం. ఈ పాత్ర తనకు దక్కడం పట్ల రాయ్ లక్ష్మి ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇప్పటివరకు రకరకాల పాత్రలు చేశానని, నెగటివ్ ఛాయలతో కొనసాగే పాత్రను తొలిసారిగా ఇందులో చేస్తున్నానని ఈ సందర్భంగా ఆమె తెలిపింది. ఇలాంటి పాత్ర కోసమే ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నానని చెప్పింది. మర్డర్ మిస్టరీ చిత్రంగా రూపొందే ఈ చిత్రానికి స్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు.  
Rai Lakshmi
Indrani Mukharjia
Sheena Bora

More Telugu News