Hyderabad: బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం.. నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష

  • 2015లో శంషాబాద్‌లో ఘటన
  • ప్రేమ పేరుతో బాలికకు మాయమాటలు చెప్పి వలలో వేసుకున్న నిందితుడు
  • జైలు శిక్షతోపాటు రూ.6 వేల జరిమానా విధించిన కోర్టు

ప్రేమ పేరుతో బాలికను నమ్మించి, ఆపై కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన యువకుడికి కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని సాదత్‌కాలనీకి చెందిన సయ్యద్ రఫీఖ్‌ వివాహితుడు. 2015లో 16 ఏళ్ల బాలికను ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి వలలో వేసుకున్నాడు. అదే ఏడాది జూన్‌లో బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు.

కేసు నమోదు చేసుకున్న రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును విచారించిన సైబరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు నిందితుడిని దోషిగా తేల్చి పదేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.6 వేల జరిమానా విధించింది.

  • Loading...

More Telugu News