Aditya Thakrey: ఆస్తుల వివరాలను ప్రకటించిన ఆదిత్య థాకరే

  • ముంబై వర్లీ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్న ఆదిత్య థాకరే
  • మొత్తం ఆస్తులు 16.05 కోట్లుగా వెల్లడి
  • ఇందులో రూ. 4.67 కోట్ల స్థిరాస్తులు  
శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే కుమారుడు ఆదిత్య థాకరే తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ముంబై వర్లీ శాసనసభ స్థానం నుంచి ఆయన ఎన్నికల బరిలోకి దిగారు. ఈ సందర్భంగా ఎన్నికల అఫిడవిట్ లో తన ఆస్తుల వివరాలను పేర్కొన్నారు. తన మొత్తం ఆస్తులను రూ. 16.05 కోట్లుగా ఆదిత్య వెల్లడించారు. ఇందులో రూ. 4.67 కోట్ల స్థిరాస్తులు, రూ. 11.38 కోట్ల చరాస్తులు ఉన్నాయని తెలిపారు. బ్యాంకులో రూ. 10.36 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని... రూ. 6.50 లక్షల విలువ చేసే బీఎండబ్ల్యూ కారు ఉందని తెలిపారు. రూ. 64.65 లక్షల విలువ చేసే నగలు, ఇతర వస్తువులు ఉన్నాయని పేర్కొన్నారు. తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని చెప్పారు.
Aditya Thakrey
Shivsena
Assets

More Telugu News