Botsa Satyanarayana: నిజమే.. రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉన్నాయి: బొత్స

  • సమస్య పరిష్కారం కోసం కేంద్రం, ఇతర రాష్ట్రాలతో చర్చలు జరుపుతున్నాం
  • కన్నా వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం
  • ఆసుపత్రుల వద్ద క్యాంటీన్లకు కసరత్తు చేస్తున్నాం
ఏపీలో విద్యుత్ కోతలు ఉన్న మాట నిజమేనని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విద్యుత్ సమస్య పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వంతో పాటు పక్క రాష్ట్రాలతో కూడా చర్చలు జరుపుతున్నామని తెలిపారు. విద్యుత్ కొరత గురించి ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. గ్రామ సచివాలయాల ఆలోచన చంద్రబాబుకు వచ్చినప్పుడు... ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. కొత్త ఇసుక పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత కొరత తగ్గిందని చెప్పారు. ఆసుపత్రుల వద్ద క్యాంటీన్ల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నామని తెలిపారు.
Botsa Satyanarayana
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News