Chittoor District: వంట గ్యాస్‌ లీకై పేలిన సిలిండర్‌.. ఆరుగురికి తీవ్ర గాయాలు

  • క్షతగాత్రుల్లో ఇద్దరు చిన్నారులు
  • బాధితులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
  • చిత్తూరు జిల్లా మిట్టూరు ప్రాంతంలో ఘటన
ఇంట్లోని వంట గ్యాస్‌ సిలెండర్‌ పేలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. చిత్తూరు జిల్లా మిట్టూరు ప్రాంతంలో ఈ రోజు ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...మిట్టూరులో నివాసం ఉంటున్న ఓ ఇంట్లోని సిలెండర్‌ నుంచి గ్యాస్‌ లీకైంది. దీన్ని గమనించని కుటుంబ సభ్యులు గ్యాస్‌ పొయ్యి వెలిగించేందుకు చేసే ప్రయత్నంలో పేలుడు సంభవించింది. దీంతో ఇంట్లో ఉన్న ఇద్దరు చిన్నారులతో సహా మొత్తం ఆరుగురు గాయపడ్డారు. బాధితులను స్థానికులు హుటాహుటిన చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Chittoor District
mitturu village
gas cylender explosion
6 injured

More Telugu News