New Delhi: మసాజ్ పార్లర్లలో వ్యభిచార దందా.. అమ్మాయిల రేట్ కార్డులు చూసి షాకైన మహిళా కమిషన్

  • వివిధ ప్రాంతాల్లో దాడులు చేసిన మహిళా కమిషన్
  • పెద్ద ఎత్తున కండోములు, రేట్ కార్డులు స్వాధీనం
  • అమ్మాయిలకు విముక్తి
ఢిల్లీలోని మసాజ్ పార్లర్లలో గుట్టుగా సాగుతున్న వ్యభిచార దందాను మహిళా కమిషన్ రట్టు చేసింది. అందులోని అమ్మాయిలను కాపాడింది. బురారీ ప్రాంతంతోపాటు పశ్చిమ ఢిల్లీలోని ద్వారకలలో మసాజ్ సెంటర్లు, స్పాలపై మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ నేతృత్వంలోని బృందం దాడిచేసింది.

ఈ సందర్భంగా విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. మసాజ్ పార్లర్ల నుంచి పెద్ద మొత్తంలో కండోములతోపాటు అమ్మాయిల ధరలను నిర్ణయిస్తూ ఏర్పాటు చేసిన కార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. యువతుల అశ్లీల ఫొటోలతోపాటు వాటిపై ఉన్న ధరలు చూసి మహిళా కమిషన్ సభ్యులు విస్తుపోయారు. నిర్వాహకులపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
New Delhi
spa centre
massage centres
women commission

More Telugu News