Team India: టీమిండియా జోరుకు వరుణుడు అడ్డంకి

  • వైజాగ్ లో వర్షం
  • వెలుతురులేమితో నిలిచిన ఆట
  • వికెట్ నష్టపోకుండా 202 పరుగులు చేసిన భారత్
వైజాగ్ లో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టుకు వరుణుడు అడ్డంకిగా మారాడు. తొలి రోజు ఆటలో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతున్న వేళ వర్షం కురవడంతో పాటు వెలుతురులేమి కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. అప్పటికి భారత్ వికెట్ నష్టపోకుండా 202 పరుగులు చేసింది.

ఓపెనర్ గా కుదురుకుంటాడా? లేదా? అంటూ అనేక సందేహాల నడుమ బరిలో దిగిన రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీతో విమర్శకుల నోళ్లు మూయించగా, కొత్త కుర్రాడు మయాంక్ అగర్వాల్ తిరుగులేని టెక్నిక్ తో అలరించాడు. రోహిత్ శర్మ 115 పరుగులు, మయాంక్ అగర్వాల్ 84 పరుగులతో అజేయంగా ఉన్నారు. రోజంతా శ్రమించినా సఫారీ బౌలర్లు ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు.
Team India
South Africa
Vizag
Cricket
Test
Rain

More Telugu News