IAF: భారత వాయుసేన కేంద్రాల్లో హైఅలర్ట్

  • హెచ్చరికలు జారీచేసిన నిఘా వర్గాలు
  • జైషే మహ్మద్ ఉగ్రవాదుల కదలికలపై అనుమానాలు
  • ఉత్తరాదిన ఉగ్రకలకలం

ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్న భారత వాయుసేన కేంద్రాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన 10 మంది ఆత్మాహుతి దళ సభ్యులు భారత వాయుసేన ప్రధాన కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడవచ్చంటూ ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. బాలాకోట్ ఉగ్రవాద స్థావరం పునఃప్రారంభమైందని, పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు సరిహద్దు వద్దకు చేరుకుంటున్నారని ఇటీవలే ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో, భారత నిఘా వర్గాలు చేసిన హెచ్చరికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

బాలాకోట్ దాడులకు ప్రతీకారంగా జమ్మూకశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లోని శ్రీనగర్, అమృత్ సర్ హిండన్, అవంతిపూర్ వంటి కీలక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్ లపై ఆత్మాహుతి దాడులు చేపట్టాలని జైషే మహ్మద్ పక్కా ప్రణాళికలు రూపొందించినట్టు కేంద్రానికి సమాచారం అందింది. దాంతో, భారత వాయుసేన కేంద్రాల వద్ద భద్రత రెట్టింపు చేయడంతో పాటు, అక్కడి పాఠశాలలను కూడా మూసివేశారు.

  • Loading...

More Telugu News