saira movie: విధులకు డుమ్మా కొట్టి 'సైరా' సినిమాకి చెక్కేసిన ఆరుగురు ఎస్‌ఐలు.. బదిలీ వేటు వేసిన ఎస్పీ

  • సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కర్నూలు జిల్లా ఎస్పీ పకీరప్ప
  • విధి నిర్వహణలో ఉండగా సినిమా చూడడాన్ని తప్పుపట్టిన బాస్‌
  • గతుక్కుమన్న బాధితులు
చిరంజీవి సినిమా మొదటి షో చూడాలన్న సగటు అభిమానిలాగే ప్రవర్తించిన ఆ ఎస్‌ఐలకు జిల్లా బాస్‌ ఊహించని షాక్‌ ఇచ్చారు. విధుల నిర్వహణలో ఉండగా సినిమా చూస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ బదిలీ వేటు వేశారు. చిరంజీవి, అమితాబ్ బచ్చన్ కలసి నటించిన సైరా చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. స్వాతంత్య్ర పోరాట కాలంనాటి యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంపై ముందు నుంచి అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

తొలిరోజే సినిమా చూసేయాలని సగటు అభిమానులు ఆశిస్తారు. కర్నూల్‌ జిల్లాలోని కోవెలకుంట్లలో సైరా నరసింహారెడ్డి బెనిఫిట్‌ షోకు ఆ ఎస్‌ఐలు కూడా అలాంటి ఉత్సుకతతోనే వెళ్లారు. కాకపోతే వారు విధుల్లో ఉండగా ఈ పని చేయడం జిల్లా ఎస్పీకి ఆగ్రహం తెప్పించింది. ఎస్‌ఐల తీరుపై ఎస్పీ పకీరప్ప తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందున వీఆర్‌కు పంపాలని ఆదేశించారు.
saira movie
benifit show
six SI's
VR
Kurnool District
sp pakirappa

More Telugu News