Paruchuri: ఆకాశానికి ఎదిగిన హాస్యనటుడు వేణుమాధవ్: పరుచూరి గోపాలకృష్ణ

  • వేణుమాధవ్ స్థానం ప్రత్యేకం 
  • ఆయన లేని లోటు తీర్చలేనిది
  • గుండె తరుక్కుపోతోందన్న పరుచూరి    
తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో కమెడియన్ వేణు మాధవ్ గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు. " కమెడియన్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన వేణుమాధవ్, తనదైన ప్రత్యేకతను చాటుతూ ఆకాశానికి ఎదిగాడు. రాజమౌళి సినిమాల్లో సైతం తన బ్లాకు కామెడీకి ఎంతో పేరు వచ్చేది. తనదైన బాడీ లాంగ్వేజ్ తో .. డైలాగ్ డెలివరీతో గమ్మత్తు చేసేవాడు.

'లక్ష్మీ' సినిమాలో తెలంగాణ శకుంతలతో కలిసి ఆయన చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. ఆ క్లిప్పింగ్స్ టీవీలో చూస్తుంటే కన్నీళ్లొస్తున్నాయి. తెలుగు చిత్రపరిశ్రమకి సంబంధించిన కమెడియన్స్ అంతా ఇలా ఒకరి తరువాత ఒకరుగా వెళ్లిపోతుండటం చూస్తుంటే ఎంతో బాధనిపిస్తోంది. ఇంత తక్కువ వయసులోనే వేణుమాధవ్ చనిపోవడం .. ఆయన తల్లి తల్లడిల్లిపోవడం చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది" అని ఆవేదన చెందారు.
Paruchuri
Venu Madhav

More Telugu News