howdy-modi: అబ్‌కీ బార్.. ట్రంప్ సర్కార్.. మోదీ ఉద్దేశం అది కాదు: జైశంకర్ వివరణ

  • హ్యూస్టన్ సభలో మోదీ ‘అబ్‌కీ బార్ ట్రంప్ సర్కార్’ నినాదం
  • విరుచుకుపడిన కాంగ్రెస్ 
  • వివరణ ఇచ్చిన విదేశాంగ శాఖ

అమెరికాలో ఇటీవల జరిగిన ‘హౌడీ-మోదీ’ కార్యక్రమంలో ‘అబ్‌కీ బార్ ట్రంప్ సర్కార్’ అని భారత ప్రధాని నరేంద్రమోదీ అనలేదని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ వివరణ ఇచ్చారు. మోదీ ఉద్దేశం అది కాదన్న సంగతి సరిగ్గా గమనిస్తే అర్థం అవుతుందన్నారు. హ్యూస్టన్‌లో నిర్వహించిన ప్రవాస భారతీయుల సభలో పాల్గొన్న ట్రంప్‌ను పరిచయం చేస్తూ.. ట్రంప్‌తో భారత్ సత్సంబంధాలను కోరుకుంటోందని మోదీ అన్నారు. అంతేకాదు, ‘అబ్‌కీ బార్ ట్రంప్ సర్కార్’ అన్న నినాదం వినిపిస్తోందని పేర్కొన్నారు. మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ విరుచుకుపడింది.

ట్రంప్‌కు మద్దతు పలికి భారత విదేశాంగ విధానాన్ని మోదీ ఉల్లంఘించారని విమర్శించింది. భారత్-అమెరికా బంధం ఉభయతారకమేనన్న విషయాన్ని మోదీ మర్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ విమర్శలపై స్పందించిన జైశంకర్ వివరణ ఇస్తూ.. మోదీ అలా అనలేదని పేర్కొన్నారు. ‘అబ్‌కీ బార్ ట్రంప్ సర్కార్’ అంటున్న మీరు అధ్యక్ష అభ్యర్థిగా ఇండియన్ అమెరికన్లతో సత్సంబంధాలు కోరుకుంటున్నట్టు అర్థమవుతోందని ట్రంప్‌ను ఉద్దేశించి మోదీ అన్నారని పేర్కొన్నారు. అమెరికా అంతర్గత రాజకీయాల్లో భారత్ తలదూర్చబోదని జై శంకర్ స్పష్టం చేశారు.

More Telugu News