East Godavari District: మహిళ స్నానం చేస్తుండగా వీడియో.. అది చూపించి రూ.5 లక్షల డిమాండ్

  • తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో ఘటన
  • బాధితురాలి భర్త హెచ్చరించడంతో కక్ష పెంచుకున్న యువకుడు
  • పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు
మహిళతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా ఆమె స్నానం చేస్తుండగా వీడియో తీసి వేధింపులకు పాల్పడ్డాడో ప్రబుద్ధుడు. ప్రస్తుతం పరారీలో ఉన్న అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన యువకుడు ఆత్రేయవరపు వెంకటనాగ సాయికృష్ణ.. తన ఇంటికి సమీపంలో ఉండే వివాహితపై కన్నేశాడు. ఆమెను లొంగదీసుకోవాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. దీంతో ఆమె ఈ విషయాన్ని తన భర్త దృష్టికి తీసుకెళ్లింది. అతడు సాయిని మందలించాడు. మరోసారి ఇలా చేస్తే బాగుండదని హెచ్చరించాడు.

తనపై ఫిర్యాదు చేసిన వివాహితపై కక్ష పెంచుకున్న సాయికృష్ణ ఓరోజు ఆమె స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీశాడు. దానిని ఆమెకు చూపించి రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేదంటే సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని బెదిరించాడు. అతడి వేధింపులు భరించలేని ఆమె మరోమారు భర్త దృష్టికి తీసుకెళ్లింది. దీంతో అతడు సోమవారం భార్యతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న సాయికృష్ణ కోసం గాలిస్తున్నారు.
East Godavari District
kothapeta
video
woman

More Telugu News