swami chinmayananda: లా విద్యార్థినిపై అత్యాచారం ఆరోపణలు.. ఆసుపత్రి నుంచి జైలుకు బీజేపీ నేత చిన్మయానంద

  • 14 రోజుల జుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు
  • ఆ వెంటనే చాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరిన చిన్మయానంద
  • బెయిలు ఇచ్చేందుకు నిరాకరణ

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేత, కేంద్రమాజీ మంత్రి చిన్మయానంద సోమవారం రాత్రి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే, ఆ వెంటనే పోలీసులు ఆయనను షాజహాన్‌పూర్ జైలుకు తరలించారు. తన కళాశాలలో చదువుకుంటున్న లా విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న చిన్మయానందను 14 రోజుల జుడీషియల్ కస్టడీకి తీసుకోవాలని గతంలో కోర్టు ఆదేశించింది. అయితే, హై బీపీ, చాతీనొప్పితో ఆయన బాధపడుతుండడంతో ఆసుపత్రికి తరలించారు.

సోమవారం ఆయన కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. దీంతో పోలీసులు అటునుంచి అటే ఆయనను జైలుకు తరలించారు. కాగా, ఈ కేసులో చిన్మయానందకు బెయిలు ఇచ్చేందుకు ఉత్తరప్రదేశ్ జిల్లా కోర్టు నిరాకరించింది. మరోవైపు, డబ్బుల కోసం చిన్మయానందను బ్లాక్ మెయిల్‌ చేసిందన్న ఆరోపణలపై బాధితురాలైన న్యాయ విద్యార్థినిపైనా కేసు నమోదైంది. విద్యార్థినికి 14 రోజుల జుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు..బెయిలు ఇచ్చేందుకు నిరాకరించింది.

More Telugu News