Banks: నేటి నుంచి అన్ని బ్యాంకులకు ఒకే రకమైన పనివేళలు

  • ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు 
  • మధ్యాహ్నం 2:00-2:30 మధ్య భోజన విరామం
  • రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ నిర్ణయం
రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల పనివేళలు నేటి నుంచి మారనున్నాయి. ఇక నుంచి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేయనున్నాయి. మధ్యాహ్నం 2:00 గంటల నుంచి 2:30 గంటల వరకు భోజన విరామం. రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ నేటి నుంచి ఇదే సమయ పాలనను పాటిస్తాయని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ పేర్కొంది. ఇక, ప్రతి ఆదివారంతోపాటు రెండు, నాలుగు శనివారాలు బ్యాంకులు యథావిధిగా మూతపడతాయి.
Banks
timings
Telangana

More Telugu News