Gujarath: గుజరాత్ లో ప్రైవేట్ లగ్జరీ బస్సు బోల్తా... 21 మంది మృతి

  • 49 మందికి గాయాలు
  • 70 మందితో ప్రయాణిస్తున్న బస్సు
  • త్రిశూల్ ఘాట్ వద్ద అదుపుతప్పిన బస్సు
  • దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మోదీ, అమిత్ షా
గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 70 మందితో ప్రయాణిస్తున్న ప్రైవేటు లగ్జరీ బస్సు బోల్తా పడిన సంఘటనలో 21 మంది మృతి చెందారు. బనస్కాంత జిల్లా అంబాజీ పట్టణానికి సమీపంలోని త్రిశూల్ ఘాట్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో 49 మంది క్షతగాత్రులయ్యారు. భారీ వర్షాల కారణంగా బస్సు ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. తమ సొంతరాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరగడంతో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Gujarath
Road Accident
Narendra Modi
Amit Shah

More Telugu News