TTD: తిరుమల వెంకన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

  • వెంకటేశ్వరుడికి పట్టువస్త్రాలు సమర్పించిన ఏపీ సీఎం
  • జగన్ కు పరివట్టం చుట్టిన అర్చకులు
  • శ్రీవారికి పెద్ద శేష వాహన సేవ
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమంతో అంకురార్పణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం జగన్ తిరుమల వెంకన్నకు పట్టువస్త్రాలు సమర్పించారు. శాస్త్రోక్తంగా ఆయన వెండి పళ్లేన్ని తలపై ఉంచుకుని ఆలయంలో ప్రవేశించారు. అంతకుముందు ఆయనకు బేడీ ఆంజనేయస్వామి ఆలయం వద్ద అర్చకస్వాములు పరివట్టం చుట్టారు. తిరుమల పర్యటన సందర్భంగా సీఎం జగన్ స్వామివారి పెద్ద శేష వాహన సేవలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి 80 కేజీల బియ్యాన్ని తులాభారంగా సమర్పించారు.
TTD
Tirumala
Jagan
Andhra Pradesh

More Telugu News