Balakrishna: సెంటిమెంటును పక్కన పెట్టేసిన బాలకృష్ణ?

  • డిఫరెంట్ లుక్ తో బాలకృష్ణ 
  • బాలయ్య సరసన సోనాల్ - వేదిక 
  • రిలీజ్ విషయంలో ఒత్తిడి చేయని బాలయ్య
బాలకృష్ణ కథానాయకుడిగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. వైవిధ్యభరితమైన కథాకథనాలతో నిర్మితమవుతోన్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. డిఫరెంట్ లుక్ తో బాలకృష్ణ నటిస్తోన్న ఈ సినిమాలో ఆయన సరసన నాయికలుగా సోనాల్ చౌహాన్ - వేదిక కనిపించనున్నారు.

ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుందనే ప్రచారం జరుగుతోంది. సంక్రాంతి బరిలో తన సినిమా ఉండాలనే ముచ్చట బాలకృష్ణకి మొదటి నుంచి వుంది. అయితే ఈ ఏడాది సంక్రాంతి కానుకగా బాలకృష్ణ నుంచి వచ్చిన 'ఎన్టీఆర్ కథానాయకుడు' భారీ పరాజయాన్ని చవిచూసింది. అందువలన ఆయన సంక్రాంతి సెంటిమెంటును పక్కన పెట్టేశారనే టాక్ వినిపిస్తోంది. తన తాజా చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ అయ్యేలా చూడమని ఆయన దర్శకుడిని ఎంతమాత్రం ఒత్తిడి చేయకపోవడం .. ఫిబ్రవరిలో విడుదలైనా ఫరవాలేదని చెప్పడం వంటివి ఈ వార్తకి మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి.
Balakrishna
Sonal
Vedika

More Telugu News