TV9 Reporter: టీవీ9 కెమెరామెన్‌ మృతి నన్ను తీవ్రంగా కలచివేసింది: కన్నా లక్ష్మీనారాయణ

  • రోడ్డు ప్రమాదంలో మరణించిన మురళీ ప్రసాద్
  • తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన కన్నా లక్ష్మీనారాయణ
  • ప్రసాద్ లేని లోటు ఆయన కుటుంబానికి తీర్చలేనిదని వ్యాఖ్య
టీవీ9 కెమెరామెన్ మురళీ ప్రసాద్ నిన్న విజయవాడలో రోడ్డు ప్రమాదంలో మరణించడం పట్ల ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. మురళీ ప్రసాద్ మృతి తనను తీవ్రంగా కలచి వేసిందని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రసాద్ లేని లోటు ఆయన కుటుంబానికి తీర్చలేనిదని చెప్పారు. మురళీ ప్రసాద్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. ప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు.
TV9 Reporter
Kanna Lakshminarayana
BJP

More Telugu News