anupama parameshwaran: నంద్యాలలో సినీ నటి అనుపమ సందడి.. చూసేందుకు ఎగబడిన అభిమానులు

  • చందన బ్రదర్స్ షోరూంను ప్రారంభించిన నటి
  • అభిమానులకు దసరా శుభాకాంక్షలు తెలిపిన అనుపమ
  • ఆఫర్లను వినియోగించుకోవాలని సూచన
టాలీవుడ్ నటి అనుపమ పరమేశ్వరన్ ఆదివారం నంద్యాలలో సందడి చేసింది. ప్రముఖ వస్త్ర దుకాణ సంస్థ చందన బ్రదర్స్ తన 65వ షోరూంను పట్టణంలో ఏర్పాటు చేసింది. ఈ షోరూం మొదటి అంతస్తులో వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలు, రెండో అంతస్తులో చీరలు, మూడో అంతస్తులో రెడీమేడ్ వస్త్ర దుకాణాలు ఏర్పాటు చేశారు. ఈ షోరూంను ఆదివారం నటి అనుపమ పరమేశ్వరన్ ప్రారంభించింది. నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

అనుపమను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా కొందరితో ఆమె సెల్ఫీలు దిగారు. అనంతరం మాట్లాడుతూ.. తొలుత అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. దసరా సందర్భంగా షోరూంలో నగలు, వస్త్రాలపై ప్రత్యేక ఆఫర్‌లు ఇస్తున్నారని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
anupama parameshwaran
actress
nandyal
Andhra Pradesh

More Telugu News