పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారట.. 40 మంది ఉత్తరాఖండ్ నేతలపై బీజేపీ వేటు

  • వచ్చే నెల 6 నుంచి 16 వరకు ఉత్తరాఖండ్‌లో పంచాయతీ ఎన్నికలు
  • పార్టీ బరిలో నిలిపిన అభ్యర్థులకు వ్యతిరేకంగా నామినేషన్లు
  • పార్టీ నుంచి ఆరేళ్లపాటు సస్పెన్షన్ 
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై 40 మంది బీజేపీ నాయకులపై ఆరేళ్లపాటు అధిష్ఠానం వేటేసింది. అక్టోబరు 6 నుంచి 16వ తేదీ వరకు ఉత్తరాఖండ్‌లో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా 40 మంది బీజేపీ నాయకులు.. పార్టీ బరిలో నిలిపిన అభ్యర్థులకు వ్యతిరేకంగా నామినేషన్లు దాఖలు చేశారు.

దీనిని తీవ్రంగా పరిగణించిన అధిష్ఠానం ఆ 40 మందిని పార్టీ నుంచి ఆరేళ్లపాటు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు బీజేపీ ఉత్తరాఖండ్ అధ్యక్షుడు అజయ్ భట్ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్‌కు గురైన వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తామని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర భండారీ తెలిపారు.
Go Back to Shorts
Uttarakhand
BJP
suspension

More Telugu News