Vijayawada: విజయవాడలో స్టాఫ్‌నర్స్‌పై అత్యాచారం.. నిందితుడి కోసం పోలీసుల గాలింపు

  • గత నెల 4న ఘటన
    బాధితురాలి అన్నను చంపేస్తానని బెదిరింపు
    ఆత్మహత్యాయత్నంతో వెలుగులోకి
విజయవాడలో ఓ కార్పొరేట్ ఆసుపత్రి స్టాఫ్‌నర్స్‌పై గత నెలలో జరిగిన అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వారి కథనం ప్రకారం.. నగరంలోని ఓ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్‌గా పనిచేస్తున్న మొవ్వకు చెందిన యువతి తన సోదరుడితో కలిసి గుణదలలో ఉంటోంది. కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న వినోద్ అనే యువకుడు గత నెల 4న ఆమె ఇంట్లోనే అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఆపై ఈ విషయాన్ని బయటకు చెబితే ఆమె అన్నను చంపేస్తానని బెదిరించాడు. అంతేకాదు, అత్యాచార  ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి ఈ నెల 26న ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన చుట్టుపక్కల వారు ఆమెను కాపాడి ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఆరా తీయగా అసలు విషయం బయటకొచ్చింది. ఆమె ఫిర్యాదుపై  కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Vijayawada
rape
nurse
Crime News

More Telugu News