Prime Minister: ఈ-సిగరెట్లు కూడా ఆరోగ్యానికి హానికరమే: ప్రధాని మోదీ

  • అందుకే, ఈ-సిగరెట్లపై నిషేధం విధించాం
  • యువకులు పొగాకు వినియోగానికి దూరంగా ఉండాలి
  • దేశ ప్రజలంతా సంతోషంగా ఉండాలని దుర్గామాతను కోరుకుంటున్నా
ఈ- సిగరెట్లు ఆరోగ్యానికి హాని చేయవన్న అపోహ చాలా మందిలో ఉందని, వాటికి దూరంగా ఉండాలని ప్రధాని మోదీ పిలుపు నిచ్చారు. ‘మన్ కీబాత్’ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆయన మాట్లాడుతూ, అందుకే, ఈ-సిగరెట్ల అమ్మకాలు, విక్రయాలపై నిషేధం విధించామని చెప్పారు. యువకులు పొగాకు వినియోగానికి దూరంగా ఉండాలని సూచించారు. నేటి నుంచి శరన్నవరాత్రుళ్లు ప్రారంభం సందర్భంగా దేశ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సంతోషంగా ఉండాలని దుర్గామాతను కోరుకుంటున్నట్టు చెప్పారు.
Prime Minister
Narendera Modi
Manki bath
E-cigars

More Telugu News