Tirumala Tirupathi Devasthanam: టీటీడీ పాలకమండలి సభ్యుడి ప్రమాణ స్వీకారం విషయంలో గందరగోళం!

  • టీటీడీ సభ్యుడిగా ముంబై రాజేశ్ శర్మ నియామకం
  • అదే పేరు గల ఢిల్లీకి చెందిన రాజేశ్ శర్మకు సమాచారం
  • టీటీడీని ముంబై రాజేశ్ శర్మ సంప్రదించడంతో బయటపడ్డ విషయం
ఏపీ దేవాదాయ శాఖ పొరపాటు కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సభ్యుడి ప్రమాణ స్వీకారం విషయంలో గందరగోళం నెలకొంది. ఒకరికి బదులుగా మరొకరికి అధికారులు సమాచారమివ్వడంతో ఈ గందరగోళం తలెత్తింది. టీటీడీ సభ్యుడిగా ముంబైకి చెందిన రాజేశ్ శర్మను ప్రభుత్వం నియమించింది.

ఇందుకు సంబంధించిన సమాచారం మాత్రం ఢిల్లీకి చెందిన రాజేశ్ శర్మకు పంపింది. అజెండాతో పాటు ప్రమాణ పత్రాన్ని ఆయనకు పంపారు. అక్టోబర్ 3న రాజేశ్ శర్మ ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే, టీటీడీ అధికారులను ముంబైకి చెందిన రాజేష్ శర్మ సంప్రదించడంతో అసలు విషయం బయటపడింది.
Tirumala Tirupathi Devasthanam
Board
Andhra Pradesh

More Telugu News