TRS: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ‘బతుకమ్మ’ను చిన్నచూపు చూశారు: టీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి

  • ‘తెలంగాణ’ వచ్చాక అన్ని పండగలను ఘనంగా నిర్వహిస్తున్నాం
  • కోటి మంది మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశాం
  • తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో
    బతుకమ్మ పండగ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బతుకమ్మ పండగను నాటి పాలకులు చిన్నచూపు చూశారని టీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అన్ని పండగలను ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. కోటి మంది మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశామని చెప్పారు. కాగా, తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో బతుకమ్మ పండగను నిర్వహిస్తున్నారు. తెలంగాణలో మూడు వందల చోట్ల వేడుకగా నిర్వహిస్తున్నారు. అలాగే, ఇతర రాష్ట్రాల్లో, 12 దేశాల్లో బతుకమ్మ పండగకు ఏర్పాట్లు చేశారు.
TRS
Errabelli
Dayakerrao
Batukamma

More Telugu News