Hyderabad: ఈఎస్ఐ మెడికల్ స్కామ్ లో వెలుగుచూస్తున్న కొత్త కోణాలు!

  • చర్లపల్లి డిస్పెన్సరీ నుంచే పెద్ద మొత్తంలో అక్రమాలు
  • 2015- 2019 వరకూ పెద్దమొత్తంలో కొనుగోళ్లు
  • రూ.82 లక్షల విలువ చేసే మందులకు రూ.3.21 కోట్లు డ్రా చేసిన అధికారులు  

హైదరాబాద్ లోని ఈఎస్ఐ మెడికల్ స్కామ్ లో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. చర్లపల్లి డిస్పెన్సరీ నుంచే పెద్ద మొత్తంలో అక్రమాలు జరిగాయని, దేవికారాణిని అడ్డుపెట్టుకుని ఫార్మాసిస్టులు అందినంత దోచుకున్నట్టు తెలుస్తోంది. 2015 నుంచి 2019 వరకూ పెద్దమొత్తంలో మందుల కొనుగోళ్లు జరిగాయని, రూ.82 లక్షల విలువ చేసే మందులకు గానూ రూ.3.21 కోట్ల సొమ్మును ను అధికారులు డ్రా చేసినట్టు సమాచారం.

తక్కువ మొత్తంలో మందులు కొని ఎక్కువ బిల్లులు వసూలు చేసినట్లు అధికారులపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 5 ఫార్మా కంపెనీలు భాస్కర ఏజెన్సీ, క్రిష్టల్ ఎంటర్ ప్రైజెస్, శ్రీ సంతోష్, గరుడ, లక్ష్మీ ఫార్మా సంస్థలపై ఏసీబీ విచారణ చేపట్టింది. ఈఎస్ఐకు చెందిన 14 మంది ఫార్మాసిస్టులపై, ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ పద్మ, అసిస్టెంట్ డైరెక్టర్ వసంత అక్రమాలపై సమగ్ర విచారణ చేస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News